ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చాలా మంది టాక్, రివ్యూలు చూసి థియేటర్ కువెళ్లకుండా ఓటిటిలో చూద్దాము అని ఫిక్సై పోయారు.
ఈ శుక్రవారం రిలీజైన గాండీవధారి అర్జున సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..ఓ మంచి సోషల్ మెసేజ్ తో వస్తున్నామని, ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని మొదటి నుంచీ చెబుతూ వచ్చాడు. సాధారణంగా మన దేశానికి చెందిన ప్రతినిధులు ఇతర దేశాల్లో చర్చలకు వెళ్లినప్పుడు వాళ్లు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు. ఇలాంటి వాళ్లలో దేశ రక్షణ వ్యవస్థలో పని చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు. అలాంటి పాత్ర చేసాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చాలా మంది టాక్, రివ్యూలు చూసి థియేటర్ కువెళ్లకుండా ఓటిటిలో చూద్దాము అని ఫిక్సై పోయారు. ఈ నేపధ్యంలో ఓటిటి రిలీజ్ వివరాలు బయిటకు వచ్చాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘గాండీవధారి అర్జున’ చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. సినిమా రిలీజ్ అయిన 3 వారాలకు.. అంటే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 నుండి .. ‘గాండీవధారి అర్జున’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేట్ అయితే సెప్టెంబర్ 21 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. కొన్ని సినిమాలు ఓటిటిలో బాగా వర్కవుట్ అవుతాయి. అలా అక్కడ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుందేమో చూడాలి.
కథేంటి
జి-20 సదస్సు కోసం లండన్ కు వెళ్లిన మన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్ (నాజర్) ని లేపాయాలని కుట్ర జరుగుతూంటుంది. అదీ అంతర్జాతీయంగా పెద్ద పేరున్న సీ అండ్ జీ కంపెనీ ఓనర్ రణ్‌వీర్ (వినయ్ రాయ్). అతను ఈ మంత్రిని చంపేయాలనుకోవటానికి కారణం ఓ రిపోర్ట్. ఈ మినిస్టర్ ఆ రిపోర్ట్ ని ఆ సదస్సులో సబ్మిట్ చేస్తే తన కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అందుకే మినిస్టర్ నోరునే శాశ్వతంగా మూసేయాలనుకుంటాడు. అప్పుడు ఆయన్ని కాపాడటానికి యూకేలో బాడీగార్డ్‌గా పనిచేస్తున్న అర్జున్ (వరుణ్‌తేజ్) (Varun Tej)రంగంలోకి దూకుతాడు. అర్జున ఆయన్ని రక్షించగలుగుతాడా.. ఆ మినిస్టర్ సబ్మిట్ చేసే రిపోర్ట్ లో ఏముంది...ఐఏఎస్ ఐరా (సాక్షి వైద్య)తో అర్జున్ బ్రేక్ అప్ కు కారణమేంటి వంటి విషాయలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
