సినిమాలలో ఎన్ని రకాల హీరోల పాత్రలు వున్నా పోలీస్ పాత్రకుండే క్రేజ్ వేరు. అందుకే హీరోలంతా  పోలీస్ క్యారక్టర్ అనగానే ఎక్కడలేని ఊపు తెచ్చుకుంటారు. అలాగే పోలీస్ సినిమా అనగానే ఆ సినిమావైపు తెలియకుండానే మన దృష్టి మళ్ళుతుంది. అలాగే డైరక్టర్స్ కు హీరో క్యారక్టర్ ని పోలీస్ గా ఇంట్రడ్యుస్ చేస్తే ఎలివేషన్ సీన్లకు లోటు ఉండదు. మన మెగా హీరోలంతా పోలీస్ లగా కనిపిస్తున్నవారే. ఈ క్రమంలో ఇలాంటి పాత్ర చేయాలనే కోరిక మెగా హీరో వరుణ్ తేజ్ కు ఉన్నట్లుంది. త్వరలోనే సాకారం కాబోతోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పవర ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో కూడిన కథను సిద్ధం చేశాడట. అది వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇంతకుముందే సెట్స్ కి వెళ్లాలి. వేరే కారణాల వల్ల ఆలస్యమైందంటున్నారు. 

ప్రస్తుతం వరుణ్ స్పోర్ట్స్ డ్రామా 'బాక్సింగ్' చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో 'ఎఫ్ 3' చేయాల్సివుంది. దాని తర్వాత వచ్చే ఏడాది ఈ పోలీస్ స్టోరీ సెట్స్ కి వెళుతుందట. దీనిని '14 రీల్స్ ప్లస్' బ్యానర్ పై భారీ చిత్రంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.