`ఆపరేషన్ వాలెంటైన్` కోసం రామ్‌చరణ్, సల్మాన్ ఖాన్ సాయం కోరిన వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ కోసం మెగా హీరో రామ్‌చరణ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సపోర్ట్ గా ముందుకు వస్తున్నారు. ఆయన సినిమాకి అండగా నిలుస్తున్నారు.
వరుస పరాజయాల అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. శక్తి ప్రతాప్ అనే నూతన దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ మూవీ మూడు నెలల గ్యాప్‌తో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ వంతు వచ్చింది. రేపు(ఫిబ్రవరి 20న) ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.
సినిమాని తెలుగుతోపాటు హిందీలో కూడా ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్‌ని కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇక తెలుగులో వరుణ్ మెగా బ్రదర్ రామ్‌చరణ్ విడుదల చేస్తున్నారు. మరోవైపు హిందీలో బిగ్ స్టార్ ని దించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని సపోర్ట్ తీసుకున్నారు. రేపు మంగళవారం ఉదయం సల్మాన్ ఖాన్ `ఆపరేషన్ వాలెంటైన్` హిందీ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. దీంతో సర్వత్రా ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎలాఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షురు చూశారు. గత కొన్ని రోజులుగా వరుణ్ తేజ్ ఇండియా వైడ్‌గా సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు. బార్డర్‌లో ఆర్మీ సైనికులను కలిశారు. అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులను కలిశారు. అక్కడ వారితో సరదాగా గడిపారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. దీంతోపాటు టెంపుల్స్ విజిట్ చేస్తున్నారు. ఇలా నిత్యం బిజి బిజీగా గడుపుతున్నాడు. సినిమాని మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్తున్నాడు.
అయితే వరుణ్ తేజ్ నటించిన గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. `గాండీవధారి అర్జున`, `గని`తోపాటు అంతకు ముందు సినిమాలు కూడా డిజప్పాయింట్ చేశాయి. `ఎఫ్ 3` కాస్త ఫర్వాలేదనిపించుకుంది. ఇలా వరుసగా వరుణ్ తేజ్ మూవీస్ నిరాశ పరుస్తున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. పైగా తన జీవితంలోకి భార్య వచ్చింది. తన ప్రియురాలు, నటి లావణ్య త్రిపాఠిని గత నవంబర్‌లో పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ అయ్యాక విడుదలవుతున్న తొలి మూవీ ఇది. దీంతో తన లైఫ్ పార్టనర్ తనకు అదృష్టంగా మారుతుందా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిర్ సర్వార్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మార్చి 1న విడుదల కాబోతుంది.