టాలీవుడ్ లో ఎక్కడ విన్నా నీహారిక పెళ్లి కబుర్లే. రేపు (డిసెంబరు 9న) గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు శుభకార్యం జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ ఈ వేడుకకు వేదికైంది. ఇప్పటికే వధూవరులు, వారి తల్లిదండ్రులు, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్, అరవింద్, చిరంజీవి, కల్యాణ్‌ దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు సంగీత్‌ కార్యక్రమంలో ఊత్సాహంగా పాల్గొన్నారు. 

అలాగే ఈ రోజు రాత్రి నాగబాబు ఫ్యామిలీ స్పెషల్ గా ఓ కాక్ టయిల్ పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఏ విషయంలోనూ తగ్గటం లేదు. చాలా గ్రాండ్ గా భారిగా ఈ వివాహం చేస్తున్నారు. స్పెషల్ చార్టెడ్ ప్లెయిట్స్ మాట్లాడి మరీ అతిధులను ఉదయ్ పూర్ తీసుకెళ్లారు. ఈ వివాహం నిమిత్తం చాలా ఖర్చు అవుతోందని అర్దమవుతోంది. అందుతున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ ప్లానింగ్ ప్రకారం ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి నిమిత్తం పెట్టే ఖర్చు మొత్తం వరుణ్ తేజ పాకెట్ నుంచే వస్తోందని అంటున్నారు. తండ్రికు ఆ విధంగా వరుణ్ తేజ సాయిపడుతున్నారన్నమాట. మొత్తానికి నీహారిక పెళ్ళికి అన్నగారే స్వయంగా నడుం బిగించారన్నమాట. 

ఇక నిన్న రైతుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ధీక్షలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ నేటి(మంగళవారం) సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయివేట్ జెట్ లో నిహారిక పెళ్లికి బయల్దేరారు. ప్రయివేట్ జెట్ ఉదయ్ పూర్ లో ల్యాండింగ్ అవ్వగానే పవన్ కి సంబంధించిన ఫోటోలు రివీల్ కానున్నాయని సమాచారం. పవన్ చేరికతో వెన్యూకి ప్రత్యేక కళ వస్తుందని అంటున్నారు.