మెగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్, వరున్‌ తేజ్‌లు తమదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆసక్తికర కామెంట్లు చేశారు. ముందుగా వరుణ్ సాయి తో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ `నీ హెయిర్‌ స్టైల్‌ బాగుంది` అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఆ ఫోటోలో వరుణ్ హెయిర్‌ స్టైల్ అంత బాగోలేకపోవటంతో వరుణ్‌ కావాలనే సాయిని టీజ్ చేయాలని ఆ పోస్ట్ చేశాడని అర్ధమవుతోంది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సాయి ధరమ్ తేజ్‌. వరున్‌ చబ్బీ ఉన్న ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ `నీ గడ్డం స్టైల్‌ బాగుంది` అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఆ ఫోటోలో వరుణ్‌ లుక్‌ అస్సలు బాగోలేకపోవటం , అప్పటి అసలు వరుణ్‌కి పూర్తిగా గడ్డం కూడా రాకపోవటంతో వరుణ్‌ పంచ్‌కి సాయి కౌంటర్‌ ఇచ్చాడంటున్నారు ఫ్యాన్స్.

ఈ ఇద్దరు సరాదాగానే ఈ కామెంట్స్‌ చేసినా ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సాయి థరమ్ తేజ్‌ తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా, వరుణ్ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.