Bro PreRelease Event: పవన్ బాబాయ్ ఏం చేసినా మెగా హీరోల మద్దతు ఉంటుంది... వరుణ్ తేజ్ పొలిటికల్ కామెంట్స్!
బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా మెగా హీరోల మద్దతు ఆయనకు ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు.

నేడు హైదరాబాద్ శిల్పకళా వేదికగా బ్రో ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, ఊర్వశి రాతెలా ఈవెంట్లో పాల్గొన్నారు. అలాగే చిత్ర దర్శకుడు సముద్రఖని, నిర్మాత టీజీ వెంకటేష్ సైతం హాజరయ్యారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బ్రహ్మానందం ప్రత్యేక అతిథులుగా సందడి చేశారు.
వేదికపై మాట్లాడిన వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడు అనగానే నాకు ఈర్ష్య కలిగింది. తర్వాత ఆనందం వేసింది. ఎందుకంటే బాబాయ్ ని ధరమ్ తేజ్ ఒక గురువుగా చూస్తారు. ఎంతో ఆరాధిస్తారు. ఈ అవకాశం తనకే రావాలనిపించింది. ఈ మూవీ అందరికంటే సాయి ధరమ్ తేజ్ కి చాలా ఇంపార్టెంట్. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాబాయ్ చిన్నప్పటి నుండి మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇది చేయండి అది చేయండని చెప్పలేదు. కస్టపడి మీరు ఎంచుకున్న దారుల్లో ఎదగాలని చెప్పారు.
ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వర్షం, ఎండల్లో తిరుగుతుంటే మేము ఆయన పక్కన ఎందుకు లేము అనిపిస్తుంది. ఆయన మెగా ఫ్యామిలీని వదిలి మిమ్మల్ని కుటుంబంగా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ బాబాయ్ చిత్ర పరిశ్రమలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, సామాజిక సేవలో ఉన్నా... మా అందరి సపోర్ట్ ఉంటుంది. చరణ్, ధరమ్, వైష్ణవ్, నేను ఆయన వెనకుంటాము. బాబాయ్ సినిమాలు అనేకం చూసేశాము... బ్రో ఆడుతుంది. లేదంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, అంటూ ముగించారు.
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ గా బ్రో తెరకెక్కింది. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు.