యాక్షన్ థ్రిల్లర్ లోడింగ్.. అదిరిపోయిన వరుణ్ తేజ్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్
వరుణ్ తేజ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 33వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి, సెలెబ్రిటీల నుంచి వరుణ్ తేజ్ కి బర్త్ డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్ ఖరారు చేశారు. మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ టెరిఫిక్ గా ఉంది.
చూస్తుంటే ఆర్మీ, వార్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ లాగా ఈ చిత్రం అనిపిస్తోంది. వరుణ్ తేజ్ స్టైలిష్ గా కనిపిస్తూ టెర్రరిస్టులని మట్టుబెడుతున్నాడు. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలని త్వరలో ప్రకటిస్తారు.
గత ఏడాది వరుణ్ తేజ్ కి గని రూపంలో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గాండీవధారి అర్జునతో బౌన్స్ బ్యాక్ కావాలని వరుణ్ ప్రయత్నిస్తున్నాడు.