వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. అరెంజ్ మెంట్స్ అదిరిపోయాయిగా.!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ వేడుకగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. పెళ్లికి మించేలా మరుపెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. స్టేజీకి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మేడలో తాళికట్టి వివాహా బంధానికి ఆహ్వానం పలికారు. నవంబర్ 1న వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుకలకు ఇండియా నుంచి మెగా ఫ్యామిలీతో పాటు బంధువులు, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు విచ్చేశారు.
ఇక రిసెప్షన్ కోసం నూతన వధువరులు ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు వరుణ్ - లావణ్యల రిసెప్షన్ వేడుక చాలా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇండస్ట్రీలో వీరి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తున్నారు. పెళ్లి ఇటలీలో చేసుకున్నా.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుగుతోంది.
రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన స్టేజీ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తో డెకరేషన్స్ అదిరిపోయాయి. హాల్ ప్రారంభం మొదలు స్టేజీ వరకు ఫ్లవర్ రీలింగ్ తో అందంగా మార్చారు. పూలవనంలో వేడుక జరగుతుందనే ఫీలింగ్ కలుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే అతిథుల కోసం స్పెషల్ వంటకాలు, తదితర ఏర్పాట్లలో ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటున్నారు.
ఇప్పటికే రిసెప్షన్ వేడుక ప్రారంభమైంది. అతిథులు ఒక్కొక్కరుగా విచ్చేస్తున్నారు. ఇక వరుణ్ - లావణ్య స్టైలిష్ అండ్ డిజైన్డ్ వేర్స్ లో వేదికపై హాజరయ్యారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. నాగబాబు అతిథులను మర్యాదగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వేడుకగా గ్రాండ్ గా కొనసాగుతోంది.