సారాంశం
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందని అన్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రూమర్లుగా ఉన్న ఈ వార్త ఇప్పుడు నిజమైంది. వరుణ్ తేజ్, లావణ్యలు తమ ప్రేమని నిజం చేశారు. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంగేజ్‌మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. రేపే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జరగబోతుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని వరుణ్ తేజ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇదిప్పుడు ట్రెండ్ అవుతుంది.
ఇప్పటికే కొన్ని రోజులుగా ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. చాలా రోజులుగా ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఎంగేజ్‌మెంట్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారట. నిహారిక వివాహం అనంతరం మెగా హీరోలందరూ ఒక్కచోట చేరనున్నారట. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిశ్చితార్థం వేడుకకు ఆహ్వానం ఉందట. పెళ్లి మాత్రం ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేయనున్నారట. లావణ్య-వరుణ్ జంటగా `మిస్టర్` మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు. అయితే వీరి పరిచయం ప్రేమకు దారి తీసిందట.
అనంతరం `అంతరిక్షం`లో కలిసి నటించారు. అయితే గత ఏడాది నుంచి వరుణ్, లావణ్య వివాహ వార్త హాట్ టాపిక్ గా ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య ఈ వార్తలను ఖండించారు. లావణ్య త్రిపాఠి కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్లో లావణ్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం విశేషం. అలాగే ఆమె చివరి చిత్రం `హ్యాపీ బర్త్ డే` సైతం నిరాశపరిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది.
వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న `గాండీవధారి అర్జున` చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో మరో చిత్రం చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.