మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజీ అప్డేట్ తో వచ్చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ప్రకటించడం జరిగింది. గద్దలకొండ గణేష్ గా డీగ్లామర్ రోల్ లో అదరగొట్టిన వరుణ్ తేజ్... మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తరువాత ఆయన ఓ స్పోర్ట్స్ డ్రామాకు కమిటయ్యారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఆయన నటిస్తున్నారు . ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కొంతవరకు పూర్తి అయ్యింది. 

బాక్సర్ గా తెరపై కనిపించడానికి వరుణ్ చాలా కాలం కఠిన కసరత్తులు చేశారు. ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద ఆయన శిక్షణ తీసుకోవడం విశేషం. కాగా జనవరి 19 ఉదయం 10:10 నిమిషాలకు ఫస్ట్ లుక్ లాంఛ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక రోల్ పోషిస్తున్నారు. అలాగే నటుడు జగపతి బాబు ఈ మూవీలో ముఖ్య పాత్ర చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... సిద్దు ముద్దా, అల్లు వెంకట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.