వరుణ్‌ తేజ్‌ తన అభిమానులను సర్ప్రైజ్‌ చేశారు. తాను ప్రస్తుతం నటిస్తున్న `గని` చిత్రం నుంచి ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది. ఈ సినిమాలోని `గని ఆంథెమ్‌` సాంగ్‌ ప్రోమో విడుదలైంది. 

వరుణ్‌ తేజ్‌(Varun Tej) ప్రస్తుతం నటిస్తున్న చిత్రం `గని`(Ghani). బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కిరణ్‌ కొరపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో, అల్లు బాబీ నిర్మిస్తున్న చిత్రమిది. సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. రేపు(బుధవారం) Ghani Anthem పేరుతో మొదటి పాటని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ పాట ప్రోమోని విడుదల చేశారు.

ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని `దే కాల్‌ హిమ్‌ గని.. కనివిని ఎరుగని.. `అంటూ సాగే మొదటి పాట ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరో Varun Tej పాత్ర పవర్‌ని, క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా ఉంటుందని తాజా ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటని అక్టోబర్‌ 27 ఉదయం 11.08గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన సాయీ మంజ్రేకర్‌ నటిస్తుంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నారు. సినిమా కోసం వరుణ్‌ చాలా కష్టపడ్డారు. ఆయన బాక్సర్‌గా కనిపించేందుకు జిమ్‌లో శ్రమించాడు. కండలు తిరిగిన దేహాన్ని పొందాడు. ఇవన్నీ తాజాగా విడుదల కాబోతున్న పాటలో ప్రతిబింబం కాబోతున్నాయని టాక్‌. వరుణ్‌ తేజ్‌ ఈ చిత్రంతోపాటు వెంకటేష్‌తో కలిసి `ఎఫ్‌3`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కానుంది.

also read: చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, హ్యాపీ