Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు ఫిల్మ్ టైటిల్,కాస్త డిఫరెంట్ గా ఉందే

ఇందులో వరుణ్ తేజ్ firearms expert గా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ మొత్తమంతా యూకే (యునైటెడ్ కింగ్‌డ‌మ్‌) లో ఉంటుంది. 

Varun Tej film titled Gandeevadhari Arjuna
Author
First Published Jan 19, 2023, 6:20 AM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇటీవల 'ది ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రవీణ్ సత్తారు ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ శరవేగంతో చేస్తున్నారు.   వీటీ12(VT12) అనే వర్కింగ్ టైటిల్‌తో  ముస్తాబు అవుతున్న ఈ  సినిమా కు టైటిల్ ఏంటనేది బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాకు 'గాండీవధారి అర్జున' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. ఇందులో వరుణ్ తేజ్ firearms expert గా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ మొత్తమంతా యూకే (యునైటెడ్ కింగ్‌డ‌మ్‌) లో ఉంటుంది. యాక్షన్ అంతా కూడా అక్కడే అని తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. స్పై థ్రిల్లర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వరుణ్ తేజ్ సినిమాలో మెసేజ్ ఉంటుందని ప్రవీణ్ సత్తారు చెప్పారు. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ... అందులో మంచి మెసేజ్ ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలే సందేశంతో సినిమా తీస్తున్నామని ఆయన అంటున్నారు. 

 ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చేస్తారట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్. అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ  సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'వాన'లో వినయ్ రాజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తెలుగు కంటే తమిళంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. విశాల్ 'డిటెక్టివ్', శివ కార్తికేయన్ 'డాక్టర్' సినిమాలతో విలన్‌గా టర్న్ అయ్యారు. ఆ రెండు సినిమాల్లో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

ఎల్బీడబ్ల్యూ, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో గతేడాది ది ఘోస్ట్ అనే సినిమా విడుదలైంది. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా ఆశించిన విజయం అందుకోనప్పటికీ.. ఈ సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios