ఆ దర్శక,నిర్మాతలు,హీరోలకే కాక మిగతా చాలా మంది తమ అంచనా కరెక్టా కాదా అనేది చూసుకునేందుకు వెయిట్ చేస్తూంటారు. తాజాగా వరుణ్ తేజ ఓ భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకన్నారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. 


ఒక్కోసారి సినిమా రిజెక్ట్ చేయటం లేదా డేట్స్ ఇవ్వలేనంత బిజిగా ఉండటం కూడా హీరోలకు కలిసి వస్తుంది. అవి డిజాస్టర్స్ అయ్యినప్పుడు తమ ఎంపిక సరైనదే అనిపిస్తుంది. అదే సమయంలో తాను వద్దనుకున్న సినిమాలు సూపర్ హిట్టైనప్పుడు కూడా అర్రెరే భలే మిస్ చేసుకున్నామే అనిపిస్తుంది. ఇది దాదాపు ప్రతీ హీరో కెరీర్ లోనూ ప్రతీ అడుగులోనూ కనిపిస్తుంది. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ...ఆ దర్శక,నిర్మాతలు,హీరోలకే కాక మిగతా చాలా మంది తమ అంచనా కరెక్టా కాదా అనేది చూసుకునేందుకు వెయిట్ చేస్తూంటారు. తాజాగా వరుణ్ తేజ ఓ భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకన్నారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు రామబాణం.

రామబాణం చిత్రాన్ని మొదట వరుణ్ తేజ్ తో చేద్దామనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు శ్రీవాస్ వెళ్లి వరుణ్ తేజ కు కథ చెప్పటం ..ఆయనకు నచ్చక రిజెక్ట్ చేయటం జరిగిందని వినికిడి. దాంతో ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ అవటంతో వరుణ్ తేజ కథపై జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని అంటున్నారు.

లక్ష్యం, లౌక్యం సినిమాల విజయాలతో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్-శ్రీవాస్‌లు ఓ మూసకథ, పాతకథతో రామబాణం పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.బాగా పాత రొటీన్ కథ అందుకుని, కనీసం ఆ కుటుంబ భావోద్వేగాల్లో మినిమమ్ ఎమోషన్స్ లేకుండా చేసారు. భూపతిరాజా అందించిన అవుడ్‌డేటేడ్ మూసకథతో శ్రీవాస్ ఇలాంటి సినిమాను అందించారు.కథతో పాటు ట్రీట్‌మెంట్ కూడా పూర్తి రోటిన్ ఫార్ములానే నమ్ముకోవడంతో ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా అనిపించలేదు. పాటలు, ఫైట్స్‌లు షరామామూలే. వెన్నెల కిషోర్, అలీ, ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే ఉంది. రెండున్నర గంటల సినిమాలో ఎక్కడ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు చిత్ర టీమ్. 

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. జూన్ నెలాఖరుకు హైదరాబాద్ వస్తారట. ఆయన మరో కొత్త కథకు ఓకే చెప్పారని తెలిసింది. పీరియడ్ క్రైమ్ డ్రామా చేయనున్నారు. 'పలాన' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

 80వ దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర పరంగా పూర్తిగా మేకోవర్ అవుతుంది. తన కెరీర్ లోనే ఓ కొత్త ఛాలెంజ్ గా ఈ సినిమాను చూస్తున్నాడు వరుణ్ తేజ్. అప్పట్లో వచ్చిన రంగస్థలం, తాజాగా వచ్చిన దసరా సినిమాల టైపులో రస్టిక్ గా, అత్యంత సహజంగా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతానికైతే కథాచర్చలు సాగుతున్నాయి. తను చేస్తున్న రెండు సినిమాల్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత, కరుణ కుమార్ స్క్రిప్ట్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడు వరుణ్ తేజ్.