Asianet News TeluguAsianet News Telugu

ఆ దేశంలో.. వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.? అంటే పెళ్లి అక్కడేనా!

మెగా ప్రిన్స్ పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాదిలో ఓ ఇంటివాడు కాబోతున్న వరుణ్ తేజ్ తాజాగా బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. 40 మంది స్నేహితులకు పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. 
 

Varun Tej Enjoy Bachelor Party with his friends in that Country?
Author
First Published Sep 30, 2023, 5:33 PM IST

ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒక్కటి కాబోతున్నారు. ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై విషెస్ తెలిపారు. కుటుంబ సభ్యులు, సినీ పెద్దల సమక్షంలో లావణ్య - వరుణ్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. ఇక ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే షాపింగ్ కూడా చేసిన ఈ జంట అప్పుడప్పుడు మీడి కంటపడుతూ ఆకట్టుకుంటున్నారు. 

ఇక తాజా అప్డేట్ ప్రకారం.. వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుండటంతో తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారంట. అక్కడా, ఇక్కడా కాదండోయ్..  ఏకంగా స్పెయిన్ లో 40 మంది తన క్లోజ్ ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారంట. బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక బ్యాచిలర్ పార్టీనే స్పెయిన్ లో చేసుకున్న వరుణ్ తేజ్ పెళ్లి కూడా డెస్టినేషన్ ప్లేస్ లోనే చేసుకోబోతున్నారని అంటున్నారు. 

ఇంటలీలోని ఓ ప్యాలెస్ లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలై బిజీగా ఉన్నారు. వరుణ్, లావణ్య కూడా షాపింగ్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ ఫస్ట్ వీక్ లోనే వీరి పెళ్లి జరగబోతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, త్వరలోనే ఈ అప్డేట్ ను అందించబోతున్నారని తెలుస్తోంది. 

ఇక వరుణ్ తేజ్ చివరిగా ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విభిన్న కథలు ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. కానీ హిట్లు మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’తో రానున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. 2023 డిసెంబర్ 8న విడుదల కానుంది. తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios