కళ్యాణ్ బాబాయ్ విరాట్ కోహ్లీ లాంటోడు.. మెగా ఫ్యామిలీ క్రికెట్ టీం అయితే, వరుణ్ తేజ్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం మెగా ఫ్యామిలిలో జోరుగా బ్యాచిరల్ పార్టీలు జరుగుతున్నాయి.
పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ నేడు ఇండియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీకి గెస్ట్ గా వచ్చాడు. తెలుగు కామెంట్రీలో కాసేపు వరుణ్ తేజ్ క్రికెట్ పై తన అభిమానం పంచుకున్నాడు. మ్యాచ్ కి ముందు షోలో కామెంటేటర్లు వరుణ్ ని సరదా ప్రశ్నలు అడిగారు.
మెగా ఫ్యామిలీ హీరోలని క్రికెటర్స్ తో పోల్చాల్సి వస్తే ఎవరితో పోల్చుతారు అని అడిగారు. ఇక వరుణ్ వెంటనే చిరంజీవి డాడీని అంటే నాకు సచిన్ గుర్తుకు వస్తారు. క్రికెట్ లో సచిన్ ఎలాగో.. సినిమాల్లో చిరంజీవి అలా అని తెలిపారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడగగా వరుణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
కళ్యాణ్ బాబాయ్ అంటే విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తారు. ఇద్దరిలో ఆ అగ్రెషన్ ఉంటుంది. కానీ అది భాద్యతతో కూడుకున్న అగ్రెషన్ అని వరుణ్ తేజ్ అన్నాడు. విరాట్ కోహ్లీ దేశం కోసం క్రికెట్ ఆడుతున్నారు. కళ్యాణ్ బాబాయ్ ప్రజల కోసం పనిచేస్తున్నారు అంటూ వరుణ్ తెలిపారు. ఇక అల్లు అర్జున్ ని కేఎల్ రాహుల్ తో.. రాంచరణ్ కి రోహిత్ శర్మతో పోల్చాడు. ఇక సాయిధరమ్ తేజ్ ని బుమ్రాతో పోల్చాడు.