మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం వాల్మీకి. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. తొలిసారి వరుణ్ తేజ్ మాస్ రోల్ లో కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు అథర్వ, యంగ్ బ్యూటీ మృణాళిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

వాల్మీకి ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. సెప్టెంబర్ 20న వాల్మీకి చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సీనియర్ నటులు శోభన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత చిత్రంలో ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇప్పటికి ఆ పాటకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఈ ఐకానిక్ సాంగ్ ని వాల్మీకి చిత్రంలో రీమిక్స్ చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాంగ్ మేకింగ్ ని హరీష్ శంకర్ విడుదల చేశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వెయ్యి బిందెల మధ్యలో పూజా హెగ్డే అందాలని చూపిస్తూ అద్భుతమైన విజువల్స్ తో ఈ పాటని చిత్రీకరించారు. 

సాంగ్ లో పూజా హెగ్డే, వరుణ్ తేజ్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు.