Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ తేజ్ పెళ్లి చాలా కాస్ట్లీ గురూ.. నాగబాబు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన వరుణ్, లావణ్య పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. నాగబాబు తన కొడుకు పెళ్ళికి భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

Varun Tej and lavanya tripathi wedding cost and details dtr
Author
First Published Nov 2, 2023, 2:22 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి జంట బుధవారం రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు 'VarunLav' అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. 

వరుణ్ తేజ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్ళిలో సందడి చేశారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా కోలాహలంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లిలో డ్యాన్స్ చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. 

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన వరుణ్, లావణ్య పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. నాగబాబు తన కొడుకు పెళ్ళికి భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి దాదాపు రూ 10 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. కొడుకు పెళ్లి అందరికీ గుర్తుండి పోయే విధంగా ఉండాలని నాగబాబు ఖర్చుకి వెనుకాడలేదట. 

మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, ఇతర స్నేహితులు, సన్నిహితులు మొత్తం 120 మంది ఈ పెళ్ళికి హాజరయ్యారు. కాక్ టెల్ పార్టీ నుంచి, హల్దీ, మెహందీ, పెళ్లి ఇలా ప్రతి కార్యక్రమం గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు. వెడ్డింగ్ కార్డులు కూడా ఎంతో అందంగా డిజైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. 

ఇప్పుడు పూర్తయింది పెళ్లి మాత్రమే. నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండబోతోంది. మరి రిసెప్షన్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో చూడాలి. రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. మొత్తం 1000 మంది అతిథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios