ఇటలీకి చేరుకున్న వరుణ్ తేజ్ - లావణ్య.. బ్యూటీఫుల్ పిక్స్ షేర్ చేసిన మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య రోజుల్లోనే ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి కోసం ఇటలీకి బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ అక్కడి నుంచి బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరియు యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి గడియాలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులను పూర్తి చేశారు. మరోవైపు లావణ్య, వరుణ్ తమ షాపింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. వరుణ్ - లావణ్య మ్యారేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ ఇటలీలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ క్రమంలో ఇండియా నుంచి మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇటలీ బయల్దేరుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి పయనమయ్యారు. ఇక నిన్నే లావణ్య - వరుణ్ తేజ్ ఇటలీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఇటలీలో చేరుకున్నట్టు వరుణ్ తేజ్ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి చేసుకోబోతున్న ఆనందం మొహంలో కనిపించేంతలా ఫొటోలకు ఫోజులిచ్చాడు వరుణ్ తేజ్.
వరుణ్ తేజ్ పంచుకున్న ఫొటోలను లావణ్య త్రిపాఠి క్లిక్ చేయడం మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నవంబర్ 1న వీరి వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రాండ్ గా జరగనుంది. నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుణ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండటంతో అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న నూతన జంటకు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.