వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి కలసి నటించిన చిత్రం మిస్టర్. అప్పటి నుంచే వీరిద్దరి ప్రేమాయణం మొదలయింది. ఎంగేజ్మెంట్ పూర్తి కాగానే ఈ విషయం గురించి లావణ్య త్రిపాఠి కూడా హింట్ ఇచ్చింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం రోజు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్నేళ్లు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తన కోస్టార్ లావణ్య త్రిపాఠిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు.

మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం రోజు వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది.దీనితో అప్పటి నుంచి వరుణ్, లావణ్య లకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్స్, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు చేస్తున్నారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి కలసి నటించిన చిత్రం మిస్టర్. అప్పటి నుంచే వీరిద్దరి ప్రేమాయణం మొదలయింది. ఎంగేజ్మెంట్ పూర్తి కాగానే ఈ విషయం గురించి లావణ్య త్రిపాఠి కూడా హింట్ ఇచ్చింది. ఈ ప్రేమ 2016లో మొదలై ఇక లైఫ్ లాంగ్ కొనసాగుతుందని పోస్ట్ చేసింది. మిస్టర్ షూటింగ్ లో ఒకరికొకరు పరిచయం కావడం.. అది స్నేహంగా, ప్రేమగా మారడం జరిగింది. 

ఇదిలా ఉండగా తమకి ఎంగేజ్మెంట్ విషెస్ తెలిపిన అభిమానులకు సెలెబ్రెటీలకు థ్యాంక్స్ చెబుతూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టారు. ఫారెన్ లో ఇద్దరూ జంటగా నడుస్తున్న పిక్ ని పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ లేటెస్ట్ గా ఫారెన్ వెళ్ళారా లేక ఇది ఓల్డ్ ఫోటోనా అనేది క్లారిటీ లేదు. 

View post on Instagram

వరుణ్ తేజ్ లావణ్య ఈ పిక్ లో మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. వరుణ్ వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటులో ఉండగా.. లావణ్య బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించింది. ఈ పిక్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా యాదృచ్ఛికమో ఏమో కానీ విచిత్రంగా వరుణ్ తేజ్.. లావణ్య ఇద్దరి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఒకటే.. ఇద్దరికీ చెరో 3.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.