హైదరాబాద్ లో అడుగుపెట్టిన నవదంపతులు లావణ్య-వరుణ్... అప్పుడే లుక్ మార్చేశారే!
కొత్తజంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ముగించుకుని హైదరాబాద్ చేరారు. వధూవరలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీపడ్డారు.

లాంగ్ టైం లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ పెళ్ళికి హాజరయ్యారు. అందుకే టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. మూడు రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.
సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఇక మంగళవారం హల్దీ వేడుక జరిగింది. బుధవారం రాత్రి 7:18 నిమిషాలకు లావణ్య-వరుణ్ ల పెళ్ళికి ముహూర్తం కుదిరింది. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి భార్యను చేసుకున్నారు. వరుణ్ తేజ్ పెళ్ళికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నితిన్ ఒక్కరే ఫ్యామిలీ బయట వ్యక్తి. అత్యంత సన్నిహితులకు కూడా ఆహ్వానం దక్కలేదు.
కాగా వివాహం ముగించుకుని వరుణ్-లావణ్య హైదరాబాద్ చేరారు. నవ దంపతులను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చూసిన మీడియా చుట్టుముట్టింది. లావణ్య, వరుణ్ లను కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఇక వరుణ్ లుక్ మార్చాడు. అల్ట్రా స్టైలిష్ గెటప్ లో అదరగొట్టాడు. లావణ్య మాత్రం చుడిదార్ లో పద్దతిగా కనిపించారు.
కాగా నవంబర్ 5న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, సన్నిహితులు హాజరుకానున్నారట. కొడుకు వరుణ్ పెళ్లి కోసం నాగబాబు భారీగా ఖర్చు చేశాడని సమాచారం. ఇక ఐదేళ్లకు పైగా వరుణ్-లావణ్య డేటింగ్ చేస్తున్నారు. మిస్టర్ మూవీలో వరుణ్-లావణ్య జంటగా నటించారు. అప్పుడు మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది.