మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా తెలుగు తెరకు ఆమె పరిచయం అవుతున్నమూవీ గని.కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా రీలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరో.. హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో గని సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాకు తమన్నా సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అవ్వబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ పక్కా అంటూ అనౌన్స్ చేశారు టీమ్. అంతే కాదు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కాని ఆ రోజు పవర్ స్టార్ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో గనీ మరో డేట్ వెతుక్కోక తప్పలేదు.

రిలీజ్ పోస్ట్ పోన్ అప్పటి నుంచీ ఎప్పుడు చేస్తే బాగుంటుందా అని మేకర్స్ తలపట్టుకు కూర్చున్నారు. పెద్ద సినిమాలు తమకు అడ్డు లేదకుండా చూసుకుని రిలీజ్ చేయాలి అనుకున్న గనీ టీమ్ ముందు మార్చ్ 4న రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని ఎందుకో డ్రాప్ అయ్యి చివరికి సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అంతే కాదు మార్చ్ లో అయితే ట్రిపుల్ ఆర్ మ్యానియా ఉంటుంది కనుకు.. ఆ సినిమా రిలీజ్ తరువాత గని వస్తే బాగుంటుంది అని అనుకున్నట్టున్నారు మేకర్స్.

వరుణ్ తేజ్ గని సినిమాని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసారు నిర్మాతలు. దీంతో గని సినిమా సమ్మర్ లో సూపర్ హిట్ కొట్టడానికి రెడీ అయిపోతుంది. వరుణ్ తొలిసారిగా బాక్సర్ గా కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు వరుణ్ తేజ్. బాక్సీంగ్ లో ట్రైయినింగ్ తీసుకున్నాడు.

లాక్ డౌన్ టైమ్ లో కూడా కోచ్ ను ఇంటికి పిలిపించుకుని ట్రైనింగ్ అయ్యాడు. ఫారెన్ లో స్పెషల్ కోచింగ్ తీసుకున్నాడు. జిమ్ లో కుమ్ముతూ.. సిక్స్ ప్యాక్ చేసి ఆరడుగులు రోమన్ శిల్పంలా తయారయ్యాడు మెగా ప్రిన్స్. సిక్స్ ప్యాక్ సిక్స్ ఫీట్ తో గని సినిమాలో సెంటర్ అట్రాక్షన్ గా మారిపోయాడు వరుణ్ తేజ్ ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.