తెలుగులో బిగ్ బాస్ మూడవ సిజన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. గొడవలతో ప్రేమలతో కంటెస్టెంట్స్ పోటీపడి వారి టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. రోజుకో టాస్క్ తో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు హౌస్ లో వాతావరణాన్ని చేంజ్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం కంటెస్టెంట్స్ కి సంబందించిన రెమ్యునరేషన్ పై వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

మెయిన్ గా వరుణ్ సందేశ్ అతని భార్య వితిక కు సంబందించిన పారితోషికం బయటకు వచ్చినట్లు టాక్ వస్తోంది. ఇద్దరికి కలిపి షో నిర్వాహకులు 28లక్షలు ఇచ్చినట్లు సమాచారం. మొదటిసారి బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టిన భార్య భర్తలు వీరే కావడం విశేషం. మొత్తం సీజన్ కి గాను ఈ జోడికి 28లక్షల పారితోషికాన్ని ఫిక్స్ చేశారట. షోలో టాస్క్ లను ఫెస్ చేస్తున్న ఈ జోడి ప్రస్తుతం పాజిటివ్ వే లో వెళుతోంది. 

అయితే ఎలిమినేషన్ రౌండ్ లో ప్రతిసారి ఈ జంటకు కొన్ని షాకులు తప్పడం లేదు. శిల్పా చక్రవర్తి గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం రాహుల్ మహేష్ హిమజ ఎలిమినేషన్ లో నిలవడంతో షో మరింత ఉత్కంఠను రేపుతోంది. మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.