Asianet News TeluguAsianet News Telugu

వరుణ్‌ సందేశ్‌ రీఎంట్రీ గట్టిగానే ప్లాన్‌ చేశాడట..అదిరిపోయేలా ఫస్ట్ లుక్‌!

వరుణ్‌ సందేశ్  రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఆ ఎంట్రీ అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్‌. 

varun sandesh grand re entry with induvadana movie first look soon  arj
Author
Hyderabad, First Published May 1, 2021, 6:56 PM IST

`హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం` చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడు వరుణ్‌ సందేశ్‌. టాలీవుడ్‌ ఎవరీ కొత్త కుర్రాడని తిరిగి చూసే లోపే క్రేజీ యంగస్టర్‌గా ఎదిగిపోయాడు. హీరోగా ఎంట్రీతోనే బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు బ్లాక్‌బస్టర్స్ పడటంతో వరుణ్‌ సందేశ్‌ రేంజ్‌ మారిపోయింది. అయితే ఆ సక్సెస్‌ ల తరువాత కూడా  వరుణ్‌ కి `ఏమైంది ఈ వేళా`లాంటి మంచి హిట్ కొట్టాడు.

ఆ తరువాత  `చమ్మక్‌ చల్లో`, `సరదాగా అమ్మాయితో`, `ఢీ ఫర్‌ దోపిడి`, `ఈ వర్షం సాక్షిగా`, `మామ మంచు అల్లుడు కంచు`, `లవకుశ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే  ఈ మద్య వరుణ్‌ సందేశ్‌ సినిమాలకు బ్రేక్ ఇచ్చి..  మళ్ళీ చాల రోజులు తరువాత ఒక సినిమా చేస్తున్నాడు. కాగా  తన రీఎంట్రీ  అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్‌. ఈ మేరకు ఆయన ఓ స్పెషల్‌ వీడియోని రూపొందించారు.

కమెడీయన్‌ ధన్‌రాజ్‌ తో చేసిన ఈ  వీడియోలో తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు వరుణ్‌.  నెక్ట్స్ తాను `ఇందువదన` సినిమా చేయబోతున్నాడట. చిత్ర ఫస్ట్ లుక్‌ అదిరిపోతుందని, ఊహించని విధంగా ఉంటుందని, దీనమ్మ వరుణ్‌ సందేశ్‌ ఏంట్రా ఇలా ఉన్నాడనుకోవాలని, ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫస్ట్ లుక్‌ వస్తుందన్నారు.  ఇక ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్  ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి మెగాస్టార్ ఫేమస్ సాంగ్ లోని పదాన్ని తన సినిమాకి టైటిల్ గా పెట్టుకున్న వరుణ్  నుండి మరో ఇంట్రస్టింగ్ సినిమా రాబోతుంది అన్నమాట.

 

Follow Us:
Download App:
  • android
  • ios