జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల అండ ఏ స్థాయిలో ఉందొ మరోసారి రుజువయ్యింది. పవన్ పై ఎలాంటి మాటల దాడులు జరిగినా మెగా యువ హీరోలు ప్రతి సారి పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఆర్థికంగా అన్ని పార్టీల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జనసేనకు మెగా యువ హీరోలు విరాళాలిస్తూ పవన్ కు తోడుగా నిలుస్తున్నారు. 

జనసేన పార్టీకి వరుణ్ తేజ్ కోటి రూపాయలు అలాగే నాగబాబు 25 లక్షల రూపాయలు విరాళాలు అందించినట్లు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా పేర్కొన్నారు. అదే విధంగా ఈ సహాయం తనకు ఒక క్రిస్టమస్ గిఫ్ట్ లాంటిదని ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సమయం చూసుకొని తప్పకుండా వారిని కలుస్తాను అని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసినందుకు గాను బాలకృష్ణ పై ఇటీవల నాగబాబు పరోక్షంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు నుంచి పవన్ కు మద్దతు అందడం చూస్తుంటే ముందు ముందు ఎలక్షన్స్ లో తప్పకుండా ఆయన సపోర్ట్ మరింత అందే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.