కొందరు స్టాండప్ కమెడియన్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేయడం అవి కాస్త సీరియస్ ఇష్యూగా మారడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి యాక్టింగ్ రాదంటూ ఓ స్టాండప్ కమెడియన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. 

తాజాగా మరో కమెడియన్ వరుణ్ గ్రోవర్ నటి అయేషా టాకియాని  ఉద్దేశిస్తూ చేసిన వల్గర్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయేషా టాకియా ఎద భాగానికి ఆకర్షితుడైన వరుణ్ గ్రోవర్.. ఆమె వక్షోజాలపై వల్గర్ కామెంట్స్ చేశారు.

ఒక విషయానికి సంబంధించి ఉదాహరణనిస్తూ.. ''అవి ఎలా బయటకి వస్తున్నాయంటే అయేషా టాకియా వక్షోజాల మాదిరిగా'' అంటూ నోరు జారారు. ఈ కామెంట్ కి 
అక్కడున్నవారంతా కూడా నవ్వారు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇది జరిగి సుమారు ఏడు సంవత్సరాలవుతోంది.

అయితే ఇప్పుడు ఈ వీడియోను బాలీవుడ్ దర్శకుడు అశోక్ పండిట్ షేర్ చేయడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 'ఆడవాళ్లంటే గౌరవం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు.. సోకాల్డ్ కమెడియన్' అంటూ వరుణ్ పై ఫైర్ అయ్యారు. అయేషా టాకియా తెలుగులో 'సూపర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్  అయిపోయింది.