ఏం టైటిల్ పెట్టావయ్యా..నాగశౌర్యని తెగ మెచ్చేసుకుంటున్నారు
నాగశౌర్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఆ చిత్రానికి ‘వరుడు కావలెను’ టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టైటిల్ బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ సినిమా అని,ఓ రొమాంటిక్ కామెడీ అని టైటిల్ లోనే హింట్ అవటం ఖచ్చితంగా ప్లస్ అవుతుందంటున్నారు.
ఏదో ఒక ఎట్రాక్ట్ చేసే టైటిల్ లేకపోతే బజ్ క్రియేట్ కాదు. ఆ విషయం సినిమా వాళ్లు మనస్పూర్తిగా నమ్ముతారు. అందుకేనేమో..సినిమా కథ మీద కన్నా ఎక్కువగా టైటిల్ పై చర్చలు జరుపుతారు. రకరకాల టైటిల్స్ అనుకుని,వాటిని లీక్ చేసి రెస్పాన్స్ చూసి మరీ ఫైనల్ చేస్తూంటారు. అలాగే ఆ టైటిల్స్ కోసం ఇప్పటికే ప్రచారమైన పదాలను ఎంచుకుంటూంటారు. తాజాగా నాగశౌర్య సినిమాకు కూడా అలాంటి ఇంట్రస్టింగ్ టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..నాగశౌర్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఆ చిత్రానికి ‘వరుడు కావలెను’ టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టైటిల్ బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ సినిమా అని,ఓ రొమాంటిక్ కామెడీ అని టైటిల్ లోనే హింట్ అవటం ఖచ్చితంగా ప్లస్ అవుతుందంటున్నారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని చిత్ర నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. గతంలోనూ మరో మహిళా దర్శకురాలు నందినీరెడ్డితో ‘కళ్యాణ వైభోగమే’ అనే సినిమాలో నటించారు నాగశౌర్య. ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా ప్రస్తుతం రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమా చేస్తున్నారు నాగశౌర్య. అలాగే నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శ కత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు శౌర్య.
ఇక నాగశౌర్య.. ఈ సినిమాతో పాటు సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో ‘ప్రాచీన విలువిద్య’ నేపథ్యంలో చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో పాటు ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కావడం విశేషం. దీన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.