దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఎంత వరకు ఆచరిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గ్యాప్ లేకుండా ఎదో ఒక సినిమా చేసుకుంటూ వెళ్లే వర్మ కాంట్రవర్సీ కథలను ఒక్కసారి తెరపైకి తెచ్చాడంటే అది రిలీజ్ అయ్యే వరకు వివిధ మంటలను రాజుకుంటూ వెళుతుంది. ఇప్పుడు సరికొత్తగా కులాలలను టార్గెట్ చేస్తూ వదిలిన టైటిల్ హాట్ టాపిక్ గా మారింది. 

నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వర్మ స్ట్రాంగ్ గానే  చెప్పేశాడు.అయితే ఆ టైటిల్ తో సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు క్లారిటీ రాదూ. వర్మ గతంలో చేస్తానని చేయకుండా వదిలేసిన సినిమాల సంఖ్య 50కి పైగానే ఉంటాయి. ఇక ఇప్పుడు విజయవాడకు రాగానే ఒక కొత్త ఐడియా వచ్చిందని అదే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వివరణ ఇస్తూ ఇప్పుడు కథను సెట్ చేసుకుంటాను అని చెప్పారు. 

మరి ఈ టైటిల్ తో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పిన వర్మ ఆ సినిమాలో అసలైన వెన్నుపోటు నిజాల్ని చూడవచ్చని తెలిపారు.