విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఒక లిమిట్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమాలను రిలీజ్ చేసినప్పుడు మెప్పించగలిగాడు. రక్త చరిత్ర అంతగా ఆడకపోయినా ఓ వర్గం వారికి ఆ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ నచ్చుతాయి. అయితే కొంత కాలంగా వర్మ ఎగిరిన ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నాడు. 

ముఖ్యంగా ఆఫీసర్ సినిమాతో పొడిచేస్తా.. హిట్టు కొట్టేస్తా అని చెప్పి రిలీజ్ తరువాత సైలెంట్ అయ్యాడు. ఇక రీసెంట్ గా భైరవగీత సినిమాతో అసలైన హిట్ కొట్టనున్నాం అంటూ తన శిష్యుడు సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేశాడు. అది కూడా బాగా దెబ్బేసింది. దానికి తోడు వర్మ చేసిన కామెంట్స్ పూర్తిగా నెగిటివ్ గా మారుతున్నాయి. 

అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై తప్పకుండా ఎఫెక్ట్ పడే అవకాశం ఉండటంతో వర్మ సీరియస్ గా తీసుకున్నాడట. వినేవారు ఉంటె పైకి ఎన్నైనా చెప్పే వర్మ ఇప్పుడు ఆలోచనను మార్చుకున్నాడట. సడన్ గా పూర్తయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కథలో మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. డల్ గా అనిపించిన ఎపిసోడ్ ని మరింత స్ట్రాంగ్ గా రాసుకుంటున్నాడట. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ - లక్ష్మి పార్వతి పాత్రలకు నటీనటుల ఎంపిక పూర్తయ్యింది. 

త్వరలో మిగతా నటీనటులను ఎంపికను కూడా పూర్తి చేసి షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వర్మ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం లక్ష్మీస్ ఎన్టీఆర్. కాంట్రవర్సీ కథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి వర్మ టేకింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే కనీసం టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.