తమిళనాట టాప్ హీరోగా చెలామణి అవుతోన్న నటుడు విశాల్ ఇటీవల 'పందెంకోడి2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి మిశ్రమ స్పందన 
వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం మంచి టాక్ రావడంతో ఇప్పుడు 'పందెంకోడి3' తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విశాల్ కొన్ని విషయాలను పంచుకున్నారు.

చాలా కాలంగా కోలీవుడ్ లో విశాల్.. వరలక్ష్మిల ప్రేమ వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ వీరు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమేనని చెబుతూ వస్తున్నారు.

తాజాగా విశాల్ ని వరలక్ష్మితో మీ పెళ్లి ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ''నా కలలు నెరవేరిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను.. కాబట్టి దానికి ఇంక చాలా సమయం ఉంది.

వరలక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు.. తను నా బెస్ట్ ఫ్రెండ్.. నా సోల్ మేట్.. కానీ తనతో నా పెళ్లి గురించి చెప్పడానికి ఏం లేదు.. పెళ్లి గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఇంకా అమ్మాయి దొరకలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.