ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి తారలంతా బహిరంగంగా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బయట నుండి వచ్చే అమ్మాయిలకే ఇలాంటి సమస్యలు ఉంటాయని సెలబ్రిటీల పిల్లలకు ఇలాంటివి ఎదురుకావని అనుకుంటారు.

కానీ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ రకమైన వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.

చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులతో పాటు హీరోయిన్ అయిన తరువాత ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించింది. హీరోయిన్ అయిన తరువాత ఓ టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిందట.

ఆ ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అని ప్రశ్నించినట్లు చెప్పింది. మిగతా విషయాలు అనేసరికి అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకొని కోపం వచ్చినట్లు కానీ తాను ఆ సమయానికి సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

స్టార్ కిడ్స్ అయినా.. ఇలాంటి వేధింపులు తనకు కూడా తప్పలేదు వరలక్ష్మి స్పష్టం చేసింది. ప్రస్తుతం వరలక్ష్మి హీరోయిన్ గానే కాకుండా విలన్ రోల్స్ కూడా పోషిస్తూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుంది.