హాఫ్ సెంచరీ కొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్.. అరుదైన ఘనత సాధించిన నటి.
హీరోయిన్లను మించిన డిమాండ్ తో దూసుకుపోతోంది తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్. సౌత్ లో దాదాపు అన్నీ భాషల్లో నటిస్తోంది. ఈక్రమంలో ఆమె తన కెరీర్ లో రేర్ రికార్డ్ ను సాధించింది.

వరలక్ష్మి శరత్ కుమార్.. డిఫరెంట్ యాక్ట్రస్..సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ టాప్ మోస్ట్ యాక్ట్రస్ గా నలిచింది. మరీ ముఖ్యంగా లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాల్లో నటిస్తూ.. తీరికలేకుండాగడిపేస్తోంది వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ సీనియర్ హీరో.. పొలిటికల్ లీడర్ శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి.. అవి వర్కౌట్ అవ్వకపోవడంతో.. లీడ్ క్యారెక్టర్లు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది బ్యూటీ. అంతే కాదు హీరోయిన్ గా చేస్తూనే తమి ఓ పక్క నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా రావడంతో వాటిలో ఆరితేరింది వరలక్ష్మి.
ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా నటించడం మానేసి.. నెగిటివ్ క్యారెక్టర్స్ లో ఫిక్స్ అయిపోయింది బ్యూటీ. ప్రస్తుతం సౌత్ లో స్టార్ లేడీ విలన్ అంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు వరలక్ష్మినే. ముఖ్యంగా తెలుగులో మంచి మంచి ఆఫర్లు సాధిస్తోంది వరలక్ష్మి. సందీప్ కిషన్ హీరో గా నటించి తెనాలి రామకృష్ణ మూవీలో విలన్ గా నటించిన ఆమె.. క్రాక్ సినిమాతో ఆడియన్స్ కు పిచ్చెక్కించింది. ఇలా వరుసగా విలన్ పాత్రలలో మెప్పిస్తోంది వరలక్ష్మి.
ఇక తాజాగా తాను 50 సినిమాలు పూర్తి చేశానంటూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ పోస్ట్ లో సరదా వీడియోని కూడా షేర్ చేసింది తమిళ బ్యూటీ. తాజాగా తాను 50 సినిమాలు.. పూర్తి చేసినట్టు చెబుతూ.... నా జర్నీలో భాగం అయిన వారందరికీ ధన్యవాదాలు. ఇది అంత ఈజీ కాదు. ఐ లవ్ యు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికి. మిమ్మల్ని మీరు నమ్మడం ఆపకండి. నాతో పని చేసే వాళ్లందరికి, నా కోసం పనిచేసే వాళ్లందరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా చాలా సినిమాలు చేయాలి అంటూ పోస్ట్ చేసింది.
సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ వచ్చింది వరలక్ష్మి. కేవలం 10 ఏళ్ల టైమ్ లోనే.. 50 సినిమాలు పూర్తి చేసింది వరక్ష్మి శరత్ కుమార్. అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలతో కూడా కలిపి 50 సినిమాలు అయినట్టు సమాచారం. ఈపోస్ట్ తో వరలక్ష్మికి అంతా కంగ్రాట్స్ చేబుతున్నారు.