తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్.. విశాల్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై వీరిద్దరూ ఎన్ని సార్లు ఖండించినా ప్రేమ, పెళ్లి అనే ప్రశ్నలు వీరికి ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి ప్రేమ, పెళ్లి అనే విషయాలపై ఘాటు విమర్శలు చేసింది. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా..? అంటూ ప్రశ్నిస్తుంది. ''మహిళలకు పెళ్లి అనేది యాంబిషన్ కాదు.. ఏదైనా సాధించాలి, జీవితంలో ముందుకు వెళ్లాలి ఇలాంటివి యాంబిషన్ గా ఉండాలి.

పెళ్లి చేసుకొని ఏం సాధిస్తారు చెప్పండి. ఎవరైనా, ఏదైనా యూజ్ అండ్ త్రోనే కదా..? లవ్ చేస్తే చేయొచ్చు. పెళ్లి మాత్రం టైమ్ వేస్ట్ వ్యవహారం. పెళ్లి చేసుకొని అదే ముఖాన్ని రొజూ చూడాలి.  ఎవరికోసం చూడాలి..? ఇందుకోసం చూడాలి..?. ప్రేమను పంచడంలో తప్పులేదు కానీ దాన్ని పెళ్లితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతారా..? మహిళలు కూడా అంతే..  

ఒక వ్యక్తిపై మహిళలు ఆధారపడకూదదనేది నా అభిప్రాయం. నాకు ప్రేమ వస్తుంటుంది, పోతూంటుంది. నాకు కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. వాటితో నేను డీల్ చేస్తున్నా.. ఇప్పుడు వేరే వ్యక్తి నా లైఫ్ లోకి వస్తే నా కారణంగా వారు ఇబ్బంది పడొచ్చు. అలాంటి ఇబ్బందులేం లేకుండా ఉంటే అలాంటి వాడు ఉండుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా.. లేదంటే సింగిల్ గా ఉండిపోతా.. ఎలాంటి ఇబ్బంది లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.