ఇప్పటికే ముగ్గురు భర్తలకు బ్రేకప్‌ చెప్పిన నటి వనిత విజయ్‌కుమార్‌ మరోసారి ప్రేమలో పడిందట. నాల్గోసారి ఆమెకి ప్రేమ పుట్టిందట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రేమ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న వనిత విజయ్‌కుమార్‌ ప్రేమ గోల ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఎక్కడ చూసి ఈ బొద్దు బ్యూటీ గురించిన చర్చే జరుగుతుంది. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌, నటి మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్‌కుమార్‌. ప్రధానంగా తమిళంలో నటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ తెలుగులోకి `చంద్రలేఖ` చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. పలు తెలుగు సినిమాలు చేసినా వనితకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ప్రేమ, పెళ్ళి వ్యావహారాలతో మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పటికే వనిత ముగ్గురితో ప్రేమలో పడి  మూడు పెళ్ళిళ్లు చేసుకుంది. ముగ్గురికి విడాకులు ఇచ్చేసింది. దీంతో వివాదాస్పద, సంచలన నటిగా నిలిచింది. 

ఈ ఏడాది జూన్‌లో వనిత అప్పటికే పెళ్లైన పీటర్‌ పాల్‌ ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. ఆమెకిది మూడో వివాహం. కేవలం నాలుగు నెలల్లోనే ఈ బంధానికి ఫుల్‌స్టాప్‌ పడింది. పీటర్‌ అప్పటికే పెళ్లైంది. ఆమెకి విడాకులు కూడా ఇవ్వలేదు. వనితని పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆయనకు అప్పటికే డ్రగ్స్, మద్యం తీసుకునే అలవాటు ఉంది. అది శృతి మించింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. విడిపోతున్నట్టు ప్రకటించారు.  ఈ బాధ నుంచి కూడా త్వరగానే కోలుకుంది వనిత. ఇటీవల ట్రెండీగా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

బిగ్‌బాస్ 3లో పాల్గొని మరింత పాపులర్‌ అయిన వనిత ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తాను మళ్లీ ప్రేమలో పడ్డానని గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఆమె ఎవరి ప్రేమలో పడిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు ఆమెని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. వనిత ప్రేమ వ్యవహారాలపై ప్రధానంగా కామెంట్లు చేస్తున్నారు. మరి నాల్గోసారి ప్రేమలో పడటంపై వనిత ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.