Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ కోర్టు కెక్కిన ‘వంగవీటి’ గొడవ

వంగవీటి కుటుంబంతో జరిపిన భేటిలో చెప్పిన విధగా రాంగోపాల్ వర్మ చిత్రం తీయలేదని, పూర్తిగా వక్రీకరణ జరిగిందని   రాధాకృష్ణ విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు.

Vangeeti Radha files petition against RGV movie vangaveeti

 

 

రాంగోపాల్ వర్మ తీసిన సినిమా వంగవీటి సినిమా అభ్యంతర కరంగా రంగ అభిమానులు మనోభావాలను దెబ్బ తీసే విదంగా ఉన్నాయని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలయింది.  ఈచిత్రాన్ని తమ కుటుంబాన్ని అభాసు పాలుచేసేందుకు తీశారని, అందుకే టైటిల్ ను వంగవీటిగా నిర్ణయించారని అయన పిటిషనర్ పేర్కొన్నారు.

 

వంగవీటి కుటుంబ తో జరిపిన భేటిలో చెప్పిన విధగా రాంగోపాల్ వర్మ చిత్రం తీయలేదని, పూర్తిగా వక్రీకరణ జరిగిందని  ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. రాధాకృష్ణ స్వయంగా కోర్టు కి హజరైయ్యారు. అయితే  కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

 గతంలో ఎప్పడైనా పోలీసులు కి ఈ విషయం మీద  పిర్యాదు చేశారా అని వంగవీటి రాధాకృష్ణ తరుపు న్యాయవాదిని మేజిస్ట్రేట్ కంప్లయింట్  అడిగారు. ఒక వేళ ఇచ్చినట్ల అయితే దాని ఆధారాలు రేపు కోర్టు ముందుఉంచాలని అదేశించారు ..

 

వివిధ డైలాగుల , సన్నివేశాలపై వర్మపై చర్యలు తీసుకోవాలని వంగవీటి రాధాకృష్ణ కోరారు.

 

సినిమా పాత్రలతో సంబంధం లేకండా నేపథ్య కామెంటరీ లో డైరెక్టర్ రాధా కుటుంబాన్ని, కులాన్ని కించపరిచే విధంగా అవనమాన పరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ వచ్చారని పిటిషన్ లోపేర్కొన్నారు. అనేక వ్యాఖ్యనాలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పిటిషన్లో ఉహరించిన కొన్ని వ్యాఖ్యానాలు

 

“భయపడేవాడు ఎప్పుడూ రౌడి కాలేడు..”

 

“--- రాధా..

- ఒకే ఒక్క పిల్లరౌడి తప్ప.....

అతని పేరు రాధ..అతన్ని ముద్దుగా బస్టాండ్ రాధా అని పిలిచేవారు.”.

“అతని ఇంటిపేరే వంగవీటి ..”

“- ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్..వాళ్లు మనల్ని ఏదోకటి చేసేలోపే మనమే ఏదోకటి చేయాలి రంగా....చంపేయ్ రంగా..

- చంపేద్దాం అని రాధా నోటి నుండి వచ్చిన ఒక్క శబ్దం ..భవిష్యత్ విజయవాడ రౌడియిజం నుదిటి రక్తతిలకం ఇది.”.

 

సెక్షన్500 కింద రాంగోపాల్ వర్మ అలాగే నిర్మాతలు ను క్రిమీ‌నల్ కేసుగా పరిగణించమని జరగిందని అనంతరం రాధాకృష్ణ విలేకరులకు చెప్పారు.

 
"వంగవీటి కుటుంబం పై రాంగోపాల్ వర్మ టీజర్లు రిలిజ్ చేయ్యటంతో  పిటిషన్ దాఖలు చేశాం. ఆరోజు  రాంగోపాల్ వర్మ తరుపున నిర్మాతలు హైకోర్టు లో వంగవీటి కుటుంబంతో మాట్లాడి అభ్యంతరాలు ఉంటే మాట్లాడి రిలీజ్ చేస్తామని హైకోర్టు కి తెలిపారు.దానిలో భాగంగా రాంగోపాల్ వర్మ విజయవాడలో పెద్దమనుషులు సమక్షంలో వంగవీటి కుటుంబంతో చర్చించారు. సినిమాలో అభ్యంతరాలు  వర్మకి చెప్పటం జరిగింది. కాని డిసెంబరు 23 న సినిమా రాష్ట్ర వ్యాప్తంగా వర్మ రిలిజ్ చేశారు. సినిమాలో ‌మా తండ్రి ని,పెదనాన్నని, అమ్మని రౌడిలు గా చిత్రీకరించారు. రాధా రంగా అభిమానులు మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉంది. అలాగే హైకోర్టు ని ధిక్కరించినట్లుగా కూడా సినిమా ఉంది. అందుకే మా న్యాయవాదులు తో చర్చించి ఈ రోజు కోర్టులో పిటిషన్ వేశాము. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కచ్చితంగా రాంగోపాల్ వర్మకి శిక్ష పడాలి," అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios