ఇటీవల 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడు తన ప్రేమ. పెళ్లి విషయాల గురించి చెప్పుకొచ్చాడు. మాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీ ప్రేమకథలో చాలా ట్విస్ట్ లే ఉన్నాయి. 'భద్ర' సినిమా షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా మాలినిని కలుసుకున్నానని.. మెల్లగా ఆమెతో మాటలు మొదలయ్యాయని వంశీ చెప్పారు.

కొన్ని రోజులకు ఆమెపై ఫీలింగ్స్ మొదలయ్యాయని.. దీంతో ఆమెకి ప్రపోజ్ చేయాలని బెంగుళూరు వెళ్లినట్లు చెప్పారు. అయితే ఆమె మాత్రం ఒప్పుకోలేదట. తన ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇలాంటివి వద్దని చెప్పడంతో వంశీ చాలా బాధ పడ్డాడట. అయినా సరే ఓ రోజు ఆమెకి ఫోన్ చేసి'నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు.. నువ్ నా లైఫ్ లోకి వస్తే నేను హ్యాపీ గా ఉంటా' అని చెప్పడంతో అదే రోజు సాయంత్రం ఆమె ఫోన్ తన ప్రేమను యాక్సెప్ట్ చేసిందని చెప్పుకొచ్చారు.

అయితే ఇద్దరి ఇళ్లల్లో పెళ్లికి ఒప్పుకోకపోవడం, అదే సమయంలో వంశీ డైరెక్ట్ చేసిన 'మున్నా' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాగా డిస్టర్బ్ అయినట్లు చెప్పారు. ఆ సమయంలో వంశీ పైడిపల్లి తండ్రి అతడికి తనకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేయాలనుకున్నారట. మాలిని తల్లి తండ్రులతో మాట్లాడి గ్రాండ్ గా తన తండ్రి పెళ్లి చేయించారని వంశీ చెప్పుకొచ్చాడు.

అయితే తన పెళ్లికి ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్ మాత్రమే వచ్చారని, సుమారు గంటసేపు తన పెళ్లిలో ఎన్టీఆర్ ఉన్నారని చెప్పారు. అప్పటికి ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని, కలిసి కార్డ్ ఇస్తే ఆయన పెళ్లికి వచ్చి అంతసేపు ఉన్నారని అన్నారు.