మహర్షి చిత్రం విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. రైతుల నేపథ్యంలో సందేశాత్మక చిత్రాన్ని తీర్చిదిద్దిన వంశీ పైడిపల్లికి ప్రశంసలు దక్కుతున్నాయి. బృందావనం, ఎవడు, ఊపిరి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో వంశీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు మహర్షి చిత్రంతో వంశీ పైడిపల్లి స్థాయి మరింతగా పెరిగింది. 

తాజా సమాచారం ప్రకారం వంశీ తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మహర్షి తర్వాత వంశీ చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఉండబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వంశీ మొదలు పెట్టిన కథ చరణ్ కోసమేనా లేక వేరే ఎవరైనా హీరో కోసమా అనేది తెలియాల్సి ఉంది. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు కాబట్టి మరో ఏడాది వరకు అతడు మరో చిత్రంలో నటించే ఛాన్స్ లేదు. 

ఈ నేపథ్యంలో వంశీ అన్ని రోజులు చరణ్ కోసం ఎదురుచూస్తాడా అనే ప్రశ్న ఎదురవుతోంది. మహేష్ బాబు కోసం వంశీ దాదాపు రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. వంశీ తదుపరి చిత్రం గురించి త్వరలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.