2014లో విడుదలైన జిగర్తాండ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బాబీ సింహా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా హరీష్ శంకర్ వాల్మీకి టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో గద్దల కొండ గణేష్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటిస్తున్నాడు. 

ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మరో అంశం ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తోంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రేయసిగా నటిస్తోంది. పూజా హెగ్డే పాత్ర ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో ఉండదు. 

పూజా హెగ్డే, వరుణ్ తేజ్ పై దర్శకుడు హరీష్ 80 లలో ఒక ఊపు ఊపిన శ్రీదేవి, శోభన్ బాబు ఐకానిక్ సాంగ్ ' వెల్లువొచ్చి గోదారమ్మ' ని రీమిక్స్ చేస్తున్నారు. ఆదివారం రోజు జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. 

యానాంలో సముద్రతీరాన వెయ్యి బిందెలతో కలర్ ఫుల్ గా ఈ సాంగ్ చిత్రికరించినట్లు హరీష్ తెలిపారు. రీమిక్స్ సాంగ్ కు మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. వాల్మీకి చిత్రంలో హైలైట్ గా నిలిచే అంశాలలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో రెండవ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ పాట కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచొస్తున్నారో అని.