మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఫిదా, ఎఫ్ 2 వంటి సక్సెస్ ఫుల్ రొమాంటిక్ చిత్రాల త‌ర్వాత గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అనే మాస్ ఎంట‌ర్‌టైన‌ర్  చేశాడు. త‌మిళ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో  తెర‌కెక్కింది. అథ‌ర్వ ముర‌ళి ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో  పూజా హెగ్డే, మృణాలినీ ర‌వి హీరోయిన్స్ గా న‌టించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.

సినీ సెల‌బ్రిటీలు చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరంజీవి, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్స్ వరుణ్ న‌ట‌నపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదు. గడ్డు పరిస్దితిని ఎదుర్కొంటున్నాడు గద్దలకొండ గణేష్.

ట్రేడ్ లెక్కల ప్రకారం 'గద్దలకొండ గణేష్' కు బ్రేక్ ఈవెన్ కావాలంటే $600K మార్క్ దాటాల్సి ఉంది.  అయితే ఇప్పటివరకూ వరుణ్ తేజ్ సినిమా కలెక్ట్ చేసింది $374K మాత్రమే. ముఖ్యంగా యుఎస్ లో  కలెక్షన్స్ ఎప్పుడూ ఓపెనింగ్స్ పైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ సినిమా మాస్ ఓరియెంటెడ్ గా సాగటంతో అక్కడ సరైన ఓపినింగ్స్ తెచ్చుకోలేక తడబడింది. ఆ తర్వాత కూడా అదే పరిస్దితి కంటిన్యూ అవుతూ కొనుక్కున్నవాళ్లకు కంగారుపుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే సెప్టెంబ‌ర్ 27న వైజాగ్‌లో చిత్ర స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సెల‌బ్రేష‌న్స్‌లో అంద‌రు పాల్గొనాలని టీం కోరారు. 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మించారు.