రిలీజ్ రోజు కలెక్షన్స్ అదిరిపోయిన ఈ సినిమా కు వీకెండ్ లో మాత్రం అనుకున్న స్దాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ చిత్రం సోమవారం నుంచి డ్రాప్ అవకుండా సక్సెస్ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో అధర్వ మురళి, మృణాళిని ప్రధాన పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. మొదట ఈ సినిమా టైటిల్‌గా ‘వాల్మీకి’ని ఖరారు చేశారు. ఈ మేరకు అన్నీ పోస్టర్స్ ని విడుదల చేశారు. కానీ, టైటిల్‌పై అభ్యంతరాలు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.
రిలీజ్ రోజు కలెక్షన్స్ అదిరిపోయిన ఈ సినిమా కు వీకెండ్ లో మాత్రం అనుకున్న స్దాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ చిత్రం సోమవారం నుంచి డ్రాప్ అవకుండా సక్సెస్ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థియోటర్స్ లో ఈ చిత్రం పర్యటించటానికి ఏర్పాట్లు చేసుకుంది. సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి, మంగళవారం నుంచి సక్సెస్ టూర్ చేస్తారని తెలుస్తోంది. సక్సెస్ మీట్ లో తాము పర్యటించే థియోటర్స్ డిటేల్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు పాతిక కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో సినిమా లాభాలతో కలిపి 30 కోట్లకు పైగా షేర్ రావాల్సి ఉంది.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు. చిరంజీవి సర్ నుంచి వచ్చిన ప్రశంస ది బెస్ట్. బన్నీ కూడా మెసేజ్ చేశారు. వీరికి థ్యాంక్స్. ఇది నా కెరీర్ బెస్ట్ అని చాలా మంది అన్నారు. ఇంత పెద్ద హిట్ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరుణ్‌కు కూడా ఇది పెద్ద హిట్‌గా నిలిచింది.
'ఎల్లువొచ్చి..’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నేను 500 బిందెలు అడిగితే మా నిర్మాతలు 1500 బిందెలు ఇచ్చారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమానే మాట్లాడుతుంది.. సినిమానే నిలబడుతుంది. ’ అని అన్నారు.
