ఎన్టీఆర్ తోనే సినిమా డైరక్షన్ మొదలు పెట్టాలని వెయిట్ చేసి, చేసి వీలుకాక మరో ఆప్షన్ ఎంచుకున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. ఎన్టీఆర్ తో వీలు కాకపోవడంతో వంశీ నేరుగా బన్నీ దగ్గరకు వెళ్లిపోయాడు. కథ విన్న వెంటనే బన్నీ ఓకె చేసేసాడు. కానీ ఇన్నాళ్లుగా సినిమా ఎప్పుడు అన్న క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.

 

ఎందుకంటే బన్నీ తో తన సినిమాకు సంబంధించి వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ పనులకు శ్రీకారం చుట్టేసాడు. లోకేషన్లు, కాస్టింగ్, షెడ్యూళ్లు తదితర వ్యవహారాలను గీతా ఆఫీస్ లో...  కూర్చుని చక్క బెట్టడం ప్రారంభించేసారు.

 

ప్రస్తుతం డిజె దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న బన్నీ తన తరువాతి ప్రాజెక్టుగా వక్కంతం వంశీ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లింగు స్వామి డైరక్షన్ లో తమిళ,తెలుగు బై లింగ్యువల్ ఒకటి చేయాల్సి ఉన్నా...లింగు స్వామికి కూడా హీరో విశాల్ తో ఓ సినిమా కమిట్ మెంట్ వుంది. అందువల్ల బన్నీకి గ్యాప్ వచ్చేలాగే వుంది. బన్నీ ఆ గ్యాప్లోనే... వక్కంతం వంశీ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. బహుశా అందుకే కావచ్చు, వంశీ ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు.