Asianet News TeluguAsianet News Telugu

‘వకీల్ సాబ్’ ఎంతొస్తే సేఫ్? అసలు లెక్క ఇదీ

ఇప్పటికే పీక్స్ కు చేరిన ప్రమోషన్స్ వకీల్ సాబ్ సినిమా బజ్ ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసారు. ఓపినింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ డిటేల్స్ చూద్దాం. 

Vakeel Saab Worldwide Pre-Release Business jsp
Author
Hyderabad, First Published Apr 8, 2021, 3:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మరికొద్ది గంటల్లోనే రిలీజ్ అవబోతోంది. .దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.  లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న అంటే రేపు  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే పీక్స్ కు చేరిన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసారు. ఓపినింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ డిటేల్స్ చూద్దాం. 

అందుతున్న సమాచారం మేరకు  వ‌ర‌ల్డ్ వైడ్ వ‌కీల్ సాబ్ థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.96 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే ఈ సినిమా రూ.80 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. ఓ ప్రక్కన సెకండ్ వేర్ .... క‌రోనా భయం ఉన్నా వ‌కీల్ సాబ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి బ‌య్య‌ర్లేమీ వెనుకంజ వేయ‌కపోవటం కలిసొచ్చిన విషయం. ఇక  నైజాం ఏరియాలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేస్తుండ‌గా.. ఆ ప్రాంత థియేట్రిక‌ల్ హ‌క్కుల విలువ రూ.25 కోట్ల‌ని లెక్క వేస్తున్నారు. క‌ర్ణాట‌క హ‌క్కులు రూ.6 కోట్ల దాకా ప‌ల‌క‌గా.. ఓవ‌ర్సీస్ రైట్స్ రూ.5 కోట్ల‌కు అమ్మారు. 

ఈ లెక్కలను బట్టి చూస్తే.. 100 కోట్ల షేర్ వ‌స్తే త‌ప్ప బ‌య్య‌ర్లు లాభాల బాట ప‌ట్ట‌ర‌ు. మరో ప్రక్క ఇప్పటికే  ఈ సినిమా నాన్-థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారా నిర్మాత‌ల‌కు రూ.50 కోట్ల ఆదాయం వచ్చేసింది. అంటే ఏకంగా ఈ సినిమా రూ.150 కోట్ల మేర బిజినెస్ చేసింది. దటీజ్ పవన్ కళ్యాణ్. 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.
 

Follow Us:
Download App:
  • android
  • ios