Asianet News TeluguAsianet News Telugu

పవన్ తో పోటీకి సై..'కేజీఎఫ్' హీరో ధైర్యం వెనక సీక్రెట్ ఇదీ?

థియోటర్స్ సైతం ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమాకే కేటాయిస్తారు. మిగిలిన థియోటర్స్ లో ఏవో చిన్న సినిమాలు లాగిస్తారు. అంతేతప్ప పెద్ద సినిమాలు పొరపాటున కూడా రిలీజ్ పెట్టుకోరు. కానీ కేజీఎఫ్ 2 తెలుగు వెర్షన్ మాత్రం పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే రిలీజ్ కానుందని సమాచారం. 

Vakeel saab vs Kgf2 for this Sankranthi
Author
Hyderabad, First Published Oct 9, 2020, 7:21 AM IST

పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలా సినిమాలు ప్రక్కకు జరిగిపోతాయి. ఆ హోరులో తమ బజ్ వినపడదని, తమను ఎవరూ పెద్దగా పట్టించుకోరని అంతా భావిస్తూంటారు. దానికి తోడు థియోటర్స్ సైతం ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమాకే కేటాయిస్తారు. మిగిలిన థియోటర్స్ లో ఏవో చిన్న సినిమాలు లాగిస్తారు. అంతేతప్ప పెద్ద సినిమాలు పొరపాటున కూడా రిలీజ్ పెట్టుకోరు. కానీ కేజీఎఫ్ 2 తెలుగు వెర్షన్ మాత్రం పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే రిలీజ్ కానుందని సమాచారం.  ఏమిటా ధైర్యం అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే తన సినిమా రిలీజ్ చేద్దామా వద్దా అనే డిస్కషన్ జరిగిందట. ముఖ్యంగా ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ..పవన్ సినిమా సమయంలో ధైర్యం చేసి కేజీఎఫ్ 2ని రిలీజ్ చేస్తారా అనే సందేహం ఉందిట. అయితే కేజీఎప్ 2 హీరో ఒకటే చెప్పారట. మన జానర్ వేరు..మనకు పక్కా మాస్ యాక్షన్...అదే వకీల్ సాబ్ విషయానికి వస్తే అది క్లాస్ మెసేజ్ ఫిల్మ్. రెండింటికి ఎక్కడా పోలిక లేదు. దేని ఆడియన్స్ దానికి ఉంటారని ధైర్యం చెప్పారట. 

అజ్ఞాతవాసి సినిమా తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాని చేస్తున్నారు పవన్  కళ్యాణ్.. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. .ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అయిపోయినట్టే.. కరోనా ప్రభావం లేకుంటే ఈ చిత్రం ఏప్రిల్ లోనే విడుదలయ్యేది.. అయితే ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 అటు యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ 2 పరిస్థితి కూడా అంతే.. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ముందుగా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అప్పుడే కరోనా ప్రభావం దేశంలో మొదలవ్వడంతో సినిమా విడుదల తేదిని వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించుతున్నారు.. భారీ హిట్ సాధించిన కేజీఎఫ్ కి సీక్వెల్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ తో పాటుగా ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

దాంతో ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’కు సరైన పోటీ  సినిమాఏదైనా ఉందంటే అది యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్2”మాత్రమే. వకీల్ సాబ్ సంక్రాంతికి వస్తుందంటూ దిల్ రాజు ఓ మాట  ప్రకటన వస్తే.. మిగతా సినిమాలైన ‘రంగ్ దే’, ‘అల్లుడు అదుర్స్’, ‘ఉప్పెన’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటివన్నీ సైడ్ అయిపోతాయి. యష్-పవన్ మాత్రమే బరిలో నిలుస్తారనేది నిజం.

Follow Us:
Download App:
  • android
  • ios