Asianet News TeluguAsianet News Telugu

‘వకీల్​ సాబ్’ కటౌట్స్.. ప్రమోషన్స్ మళ్లీ మొదలు

‘గుండెతో స్పందిస్తాడు . అండగా చెయ్యందిస్తాడు’ అని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ‘వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌’గా త్వరలోనే జీ తెలుగులో ఈ చిత్రం రాబోతోంది అని తెలియజేశారు. ఈ సినిమా ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. 

Vakeel Saab television premiere promotions jsp
Author
Hyderabad, First Published Jul 15, 2021, 2:01 PM IST

రిలీజ్ అయ్యి చాలా టైమ్ అయ్యిన తర్వాత మళ్లీ ఓ సినిమాకు ప్రమోషన్ మొదలు అవటం ఇదే మొదటి సారేమో.  దాదాపు  మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత  పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీలాంచ్  అయ్యారు.సూపర్ హిట్ కొట్టాటరు.  భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్  వర్షం కురుస్తున్న సమయంలో  కరోనా సెకండ్ వేవ్ తో బ్రేక్  పడింది. ఈ క్రమంలో ఓటీటిలో వకీల్ సాబ్ దుమ్ము రేపారు. ఆ తర్వాత ఇప్పుడు టీవి ప్రమోషన్ కు రంగం సిద్దమైంది. 

 ఈ మూవీ త్వరలో ‘జీ తెలుగు’లో ఈ చిత్రం టెలికాస్ట్‌ కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ ‘జీ తెలుగు’ తన ట్విట్టర్‌ పేజీలో ఓ ప్రకటన చేసింది. ‘గుండెతో స్పందిస్తాడు . అండగా చెయ్యందిస్తాడు’ అని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ‘వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌’గా త్వరలోనే జీ తెలుగులో ఈ చిత్రం రాబోతోంది అని తెలియజేశారు. ఈ సినిమా ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అయితే టీవీలో ప్రసారమవుతున్నప్పుడు టీవీల్లో ప్రమోషన్స్ చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ  ఛానెల్ వారు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలర్ట్స్ వేస్తుండగా ఆఫ్ లైన్ లో కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. 

వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై హైదరాబాద్ పరిసరాల్లో భారీ కటౌట్స్ తరహాలో పెయింటింగ్స్ తో చూపించి ప్రమోట్ చేస్తున్నారు. టెలివిజన్ ప్రీమియర్ కే ఈ రేంజ్ లో అనేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రమోషన్స్ ఎంతమేర టీఆర్పీ ని రాబడతాయో చూడాలని టీవీ మీడియాసైతం ఎదురుచూస్తోంది.  

 మరో ప్రక్క ఏప్రియల్ నుంచి అమేజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ అవుతోంది.దాంతో  చాలా మంది  ఈ సినిమాని ఓటీటిలో చూసేసి ఉంటారు కదా..ఇంక టీవీలో ఎవరు చూస్తారనే సందేహం కొందమంది వ్యక్తం చేస్తున్నాఛానెల్ వారు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం.
 
 ఇక హిందీ ‘పింక్’ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios