కరోనా రోజులు..థియోటర్ కు వెళ్లాలంటే భయం..ముఖ్యంగా ఫ్యామిలీలు చిన్న పిల్లలు ఉన్నవాళ్లు, పెద్ద వాళ్లతో కలిసున్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. జన సందోహానికి దూరంగా ఉంటున్నారు. ఉండాలి కూడా. అయితే తమ అభిమాన హీరో సినిమా, అదీ సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా ప్రక్కనున్న థియోటర్ లో ఆడుతూంటే చూడాలనిపిస్తుంది. కానీ ఎలా..ఇక్కడే ఓటీటి క్లిక్ అయ్యింది. ధాంక్స్ టు కరోనా అన్నట్లు ..ఓటీటికు విపరీతంగా ఆదరణ పెరిగింది.  లౌక్ డౌన్ కాలంలో ఓటీటికు అలవాటు పడిన వాళ్లు ఫ్యామిలిలతో సినిమాలను అందులోనే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

మహా అయితే అందరికన్నా ఓ రెండు నెలలు లేటుగా అంతే. ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ సినిమా కోసం కూడా జనాలు ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూడటం లో వింతేమీలేదు. ఓటీటి రిలీజ్ డేట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫలానా డేట్ ని వకీల్ సాబ్ సినిమా ఓటీటిలో వచ్చే అవకాసం ఉందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. జనం థియోటర్స్ కు రావటం తగ్గించి ఓటీటిలో చూస్తే ఎలా ...అందుకే వెంటనే  టీమ్ వెంటనే వివరణ ఇచ్చుకుంది. 

దీనిపై చిత్ర  ప్రొడక్షన్ హౌస్  ట్విట్ చేస్తూ...‘‘సినిమాపై వస్తున్న వార్తలు పక్కన పెట్టండి. ‘వకీల్‌సాబ్‌’ని థియేటర్లలో మాత్రమే చూడండి’’అంటూ వెల్లడించింది. ‘‘దయ చేసి రూమర్స్ నమ్మొద్దు. బిగ్‌స్క్రీన్‌పై వకీల్‌సాబ్‌ చూడండి. ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ సినిమాను విడుదల చేసే ఆలోచనే లేదు’’ అని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి లేకపోవచ్చు కానీ భవిష్యత్ లో ఉంటుంది కదా అని సరిపెట్టుకునేవాళ్లు ఉంటారు.అసలు ఓటీటి రిలీజ్ ఆరు నెలలు తర్వాతే ..అప్పటిదాకా మీరు ఆగగలిగితే ఆగండి అంటే అప్పుడు జనం ఆలోచనలో పడతారు. 

ఇక ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌. మూల కథలో కొన్ని మార్పులు చేసి ‘వకీల్‌ సాబ్‌’ని తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు పోటీగా ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు.  తమన్‌ సంగీతం అందించారు. హిందీ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు.