'వకీల్ సాబ్' ఓటీటి రిలీజ్ డేట్ ఎప్పుడు

 తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రోజు రోజుకీ విజృంభిస్తూండటంతో థియోటర్ కు వెళ్లి చూడాలనే కోరిక ఉన్నా..చాలా మంది ఆ ధైర్యం చేయలేకపోతున్నారు.  

Vakeel Saab Ott Release Date jsp

దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత వెండి తెరపై బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీ రీమేక్ గా వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  పవన్ కళ్యాణ్ కోర్టు సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో భాక్సాఫీస్  రికార్డ్స్ సునామీ సృష్టిస్తోంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. మొదట ఈ సినిమాని ఓటీటికు ఇచ్చేద్దామనుకున్నారు. అయితే సంక్రాంతి రిలీజ్ లకు క్రేజ్ బాగా రావటంతో .. థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రోజు రోజుకీ విజృంభిస్తూండటంతో థియోటర్ కు వెళ్లి చూడాలనే కోరిక ఉన్నా..చాలా మంది ఆ ధైర్యం చేయలేకపోతున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి.  

అందుతున్న సమాచారం మేరకు  ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కోట్లకు పైగా చెల్లించి డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు టాక్.  సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమ్ లో వకీల్ సాబ్ ప్రసారం కానున్నది. అంటే సినిమా ఏప్రిల్ 9 న రిలీజైంది కాబట్టి 50 రోజుల తర్వాత అంటే మే లాస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి రానున్నది. మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్  అయ్యే అవకాసం తెలుస్తోంది. మరోవైపు జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది.
 
ఇక ఈ చిత్రం  థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ థియేటర్స్ దుమ్ముదులుపుతోంది. బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. గత మూడు నెలలుగా ఓ మాదిరి సినిమాలే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి. ఈ మూడు నెలల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రావడం ఇదే తొలిసారి కావడం, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో వకీల్ సాబ్ పై అందరిలో క్యూరియాసిటీ, అలాగే ప్రేక్షకుల్లో సినిమాపై  బజ్ ఏర్పడ్డాయి. రిలీజ్ అయిన ఫస్ట్ షో కే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో వకీల్ సాబ్ వసూళ్ల పరంగాను అదరగొట్టేస్తోంది.  కరోనా సెకండ్ వెవ్ ఉధృతంగా ఉన్న టైం లోను వకీల్ సాబ్ థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios