పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే న్యూస్ వచ్చేసింది. వారు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కబురు అందింది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ విడుదల తేదీ ప్రకటించేశారు.  చడీచప్పుడు లేకుండా వకీల్ సాబ్ నిర్మాతలు వకీల్ సాబ్ విడుదల తేదీ పోస్టర్ విడుదల చేశారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుందని తెలియజేశారు. సమ్మర్ కానుకగా వకీల్ సాబ్ విడుదల కానుందని గతంలో చెప్పిన చిత్ర బృందం, తేదీపై నేడు స్పష్టత ఇచ్చారు. 

పవన్ కళ్యాణ్ నుండి మూవీ వచ్చి మూడేళ్లు అవుతుంది. 2018లో విడుదలైన అజ్ఞాతవాసి మూవీ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన మరో మూవీ విడుదల కాలేదు. దీనితో ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితులు లేని పక్షంలో వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ లోనే విడుదల అయ్యేది. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్న అప్డేట్ వచ్చేసింది. 
హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. 

దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.  పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా అసలు కథకు కొన్ని మార్పులు చేర్పులు జోడించడం జరిగింది. శృతి హాసన్ పవన్ కి జంటగా నటించగా.. అంజలి, నివేదా థామస్ కథలో కీలకమైన రోల్స్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.