హీరోయిన్ అంజలికి కరోనా సోకిందంటూ వరుస కథనాలు రావడంతో, వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ఆందోళ చెందడం జరిగింది. ఆమె ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడంతో పాటు, చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దీనితో మరికొందరు కరోనా బారిన పడే అవకాశం కలదని అందరూ భావించారు.


హీరోయిన్ అంజలికి కరోనా సోకిందంటూ వరుస కథనాలు రావడంతో, వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ఆందోళ చెందడం జరిగింది. ఆమె ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడంతో పాటు, చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దీనితో మరికొందరు కరోనా బారిన పడే అవకాశం కలదని అందరూ భావించారు. అయితే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని అంజలి తెలియజేశారు. తాను కరోనా బారినపడినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని అంజలి ట్విట్టర్ సందేశంలో ద్వారా తెలియజేశారు. 

నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అంటూ ఆమె స్పష్టత ఇచ్చారు. దీనితో ఆమెతో సన్నిహితంగా ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ టెన్షన్ నుండి బయటపడ్డారు. వకీల్ మూవీలో అంజలి కీలక రోల్ చేశారు. కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల పాత్రలలో అంజలి ఓ పాత్ర చేయడం జరిగింది. 

మరోవైపు వకీల్ సాబ్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లకు పైగా నెలకొన్న నిరీక్షణకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా రేపు థియేటర్స్ లో దిగనున్నారు.

హిందీ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ మూవీ తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు. నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. థమన్ వకీల్ సాబ్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

Scroll to load tweet…