ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా విడుద‌ల అంటే చాలు... ప్రేక్ష‌కుల్లోనూ, ప‌రిశ్ర‌మ‌లోనూ క‌నిపించే ఉత్సాహమే వేరు. బాక్సాఫీసు ద‌గ్గర పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది.  టీవీల్లోనూ అదే తీరు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ టీవీల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆదివారం రోజున జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు 19.1 టీఆర్పి రేటింగ్ వచ్చింది. బార్క్ ప్రతి గురువారం రోజున టీఆర్పీ రేటింగ్ వివరాలను వెల్లడిస్తుంది. గత ఆదివారం ప్రసారమైన వకీల్ సాబ్ రేటింగ్ జులై నెల 29వ తేదీన వెల్లడి అయ్యింది. థియేటర్లలో కరోనా సెకండ్ వేవ్ వల్ల వకీల్ సాబ్ ను చూడలేని ప్రేక్షకులు టీవీలలో సినిమాను చూసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

 ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి కేవలం 14 రోజులు మాత్రమే థియేటర్స్ లో ఉంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో కూడా వెంటనే వచ్చేసిన ఈ చిత్రం గత వారం జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా భారీ ప్రమోషన్స్ తో టెలికాస్ట్ అయ్యి రికార్డ్ లు బద్దలు కొట్టింది. ఆ రోజు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్నా కూడా ఈ చిత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ కి గాను 19.12 సాలిడ్ రేటింగ్ ను రాబట్టడం అంటే మాటలు కాదు. పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మరియు బెస్ట్ గా వచ్చింది అని చెప్పాలి. 

 అయితే జీ తెలుగులో ప్రసారం అయిన టాప్ టీ ఆర్ పీ రేటింట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు శ్రీమంతుడు 22.54 రేటింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ డీజే 21.7 రేటింగ్స్‌తో రెండవ స్థానంలో ఉంది. విజయ్ దేవరకొండ గీతా గోవిందం 20.8తో మూడవ స్థానంలో ఉండగా.. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నాలుగవ స్థానంలో ఉంది. వకీల్ సాబ్ హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.