అంజలి.. తెలుగు అందాల హీరోయిన్‌. ఇతర హీరోయిన్ల మాదిరి అందాల ఆరబోతను తాను దూరంగా. హద్దులు దాటని గ్లామర్‌ షోతో ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకుంటుందీ అమ్మడు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి మరింతగా దగ్గరైంది. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, తమిళంలో మాత్రం మంచి ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల `వకీల్‌ సాబ్‌` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. మరోసారి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. 

తాజాగా ఈ అమ్మడి తనకు వస్తోన్న అవకాశాలపై స్పందించింది. తనకు రాని ఆఫర్స్ విషయంలో తానెప్పుడూ బాధపడనని తెలిపింది. అందరికి ఒకేలాంటి ఆఫర్స్ వస్తాయానుకోవడం కరెక్ట్ కాదని, కొత్త వారు రావడం వల్ల తనకు ఆఫర్స్ తగ్గుతున్నాయనడంలో  వాస్తవం లేదని తెలిపింది. 

`ఇతర హీరోయిన్ల వల్ల నాకు ఆఫర్స్ తగ్గలేదు. కొత్త వారు వచ్చినా పాత వారికి అవకాశాలు తగ్గుతాయనుకోవడం లేదు. ఒక పాత్రకి ఎవరు సూట్‌ అవుతారో వారినే మేకర్స్ ఎంచుకుంటారు. అంతేగానీ ఒకరి ఆఫర్‌ని మరొకరు లాక్కునే ఛాన్స్ ఉండదు. ఆ పాత్రని నేను చేస్తే బాగుండేదని నేనెప్పుడూ అనుకోను. వేరే వాళ్లు చేసిన పాత్రను నేను చేయాలని ఎప్పుడూ కోరుకోను. నాకు వచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా` అని తెలిపింది. రాని పాత్ర కోసం బాధపడను` అని పేర్కొంది అంజలి. 

అంజలి తెలుగులో `బలుపు`, `మసాలా`, `గీతాంజలి`, `శంకరాభరణం`, `డిక్టేటర్‌`, `చిత్రాంగద`, `నిశ్శబ్దం` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన `ఆనందభైరవి` విడుదల కానుంది. దీంతోపాటు `ఎఫ్‌3`లోనూ నటిస్తుందని సమాచారం. తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా చేస్తుంది అంజలి.