పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న బిగ్ ఫీస్ట్ మరింత దగ్గరవుతుంది. వకీల్ సాబ్ మూవీ విడుదలకు కేవలం మరికొన్ని రోజులు మాత్రమే మిగిలివుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో దిగనుంది. దీనితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా నేడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డబ్బింగ్ ప్రారంభించారు. ఆయన డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెవుతున్న ఫోటోలు చిత్ర యూనిట్ విడుదల చేశారు. 


ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటిపోయింది. 2018 జనవరిలో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం తరువాత ఆయన నుండి మరో చిత్రం రాలేదు. దీనితో వకీల్ సాబ్ విడుదల కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ లో విడుదల కావలసింది. అయితే లాక్ డౌన్, వకీల్ సాబ్ విడుదల దాదాపు ఏడాది ఆలస్యం చేసింది. 


దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్ కీలక రోల్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతుంది. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.